MLC Kavitha:బీజేపీ..బీసీ వ్యతిరేక పార్టీ

22
- Advertisement -

బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవతి. గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ హాల్‌లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన ఆమె…రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించడం ఆనవాయితీ అని తెలిపారు.

కానీ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ నుంచి ప్రకటన వెలువడిందన్నారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు. గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదిగే సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు మంచివి కావని అభిప్రాయపడ్డారు.

గవర్నర్ కోటాలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను తమిళిసై తిరస్కరించారు.దీనిపై తెలంగాణ సమాజం నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Also Read:గ్రీన్ ఛాలెంజ్‌లో రక్షణశాఖ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డి

- Advertisement -