డిహైడ్రేషన్..తిరిగి ప్రచారంలోకి ఎమ్మెల్సీ కవిత

48
- Advertisement -

జగిత్యాల ఎన్నికల ప్రచారంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. డిహైడ్రేషన్‌తో ఇబ్బంది పడగా కాసేపు విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు కవిత. ఇందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Also Read:Harishrao:కేసీఆర్ అంటే నమ్మకం,విశ్వాసం

ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని…చిన్నారితో కాసేపు ముచ్చటించిన తర్వాత మరింత ఉత్సాహం వచ్చిందన్నారు. ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను అని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గం ఇటిక్యాల‌లో నిర్వ‌హించిన రోడ్డు షోలో ఎమ్మెల్యే అభ్య‌ర్థి డాక్ట‌ర్ సంజ‌య్‌కు మ‌ద్ద‌తుగా క‌విత ప్ర‌చారంలో పాల్గొన్నారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ దావ వ‌సంత మాట్లాడుతున్న స‌మ‌యంలో క‌విత అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

- Advertisement -