రైతన్నల ఆరుగాలం కష్టం అకాల వర్షాలతో దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత…ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పండిన పంటను కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక అన్నదాతలకు కన్నీటి వ్యథ మిగిలిందని విమర్శించారు.
రైతన్నల ఆరుగాలం కష్టం
అకాల వర్షాలతో దెబ్బతిన్నదిపండిన పంటను కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక అన్నదాతలకు కన్నీటి వ్యథ మిగిలింది
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న అకాల వర్షాలకు తడిసిన లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి
ఎద్దు…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 22, 2025

