అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యూనైటెడ్ పూలే ఫ్రంట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ దీక్ష ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. .
బీసీల ఆత్మ బంధువు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చాలా కాలం నుంచి ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్న విషయం విధితమే. పలు సార్లు ధర్నాలు, దీక్షలు నిర్వహించడమే కాకుండా విగ్రహ ఏర్పాటు ఆవశ్యకతపై పలు జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను రెండు సార్లు కలిసి వినతి పత్రాలు కూడా అందించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో పోరాటాన్ని ఉదృతం చేశారు. ఈ నెల 11న పూలే జయంతిలోగా ప్రభుత్వం విగ్రహం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read:కన్నడిగుల మనసు గెలుచుకున్న జమ్మూ అమ్మాయి!

