జూలై 7 వరకు కవిత కస్టడీ పొడగింపు

6
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత కస్టడీని జూలై 7 వరకు పొడగించింది న్యాయస్థానం. నేటితో కవిత కస్టడీ ముగియడంతో వర్చువల్‌గా ఈడీ అధికారులు కోర్టు ముందు హాజరు పరిచారు. వాదనలు విన్న జడ్జి వచ్చే నెల 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.

మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు.. మార్చి 15 వ తేదీన హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు తనిఖీలు కొనసాగిన తర్వాత చివరికి.. కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి.. ఢిల్లీకి తరలించారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఇదే కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. శుక్రవారం ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్‌పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

Also Read:ఢిల్లీలో షర్మిల..అన్ని కమిటీల రద్దు!

- Advertisement -