కేసీఆర్ ప్రభుత్వంపై బురద జల్లడం సహా 16 నెలల్లో ప్రభుత్వం చేసిందేమీ లేదు అన్నారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కవిత… తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సీఎం నీచంగా మాట్లాడారు అన్నారు. ముఖ్యమంత్రి మాటల వెనక ఆక్రోశం, బాధ వేరే ఉంది..టీజీఐఐసీ లో 1.75 లక్షల ఎకరాల భూమిని కేసీఆర్ అందుబాటులో ఉంచారు అన్నారు.
కంచె గచ్చిబౌలి శాంపిల్ మాత్రమే… 1.75 లక్షల ఎకరాల భూములను కుదువ పెట్టాలని కుట్ర చేస్తున్నారు అన్నారు. ఏప్రిల్ 15 న ప్రభుత్వం టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ గా మారుస్తూ రహస్త జీఓ ఇచ్చారు…. అన్ని భూములను స్టాక్ ఎక్సేంజ్ లో కుదువ పెట్టేలా జీఓ తీసుకొచ్చారు అన్నారు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిస్తే ప్రజలకు ఎందుకు దాచిపెట్టారు చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి…. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ పై ఏ మాత్రం ఆలోచన లేకుండా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేశారు అన్నారు. స్టాక్ ఎక్సేంజ్ లో పెట్టాక 1.75 లక్షల ఎకరాల భూములకు ఎవరిది బాధ్యత?, నిపుణుల సిఫార్సు లేకుండా చేస్తే జీఓను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి అన్నారు.భూములను కుదువపెట్టి… వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించడమే ప్రభుత్వ లక్ష్యం… కంచె గచ్చిబౌలి భూముల నుంచి వచ్చిన పది వేల కోట్ల విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1.80 లక్షల కోట్లు అప్పులు చేసింది, 80 వేల కోట్లు మాత్రమే అప్పులు, వడ్డీల కోసం చెల్లించారు…. లక్ష కోట్లు ఎక్కడకు పోయాయి… పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారు అన్నారు. 20 శాతం కమిషన్ ప్రభుత్వం ఇది…20 వేల కోట్లు నేరుగా రేవంత్ రెడ్డి ఖజానాలోకి వెళ్లాయి, ఆధారాలు ఉన్నాయి అన్నారు.
ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు, తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఒక్క కొత్త పథకం కూడా అమలు చేయలేదు…అప్పులు, వ్యయంపై శ్వేతపత్రం ప్రకటించాలి.
నా గురించి చాలా రోజులుగా చాలా రకాలుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు… ఇదేం కొత్త కాదు అన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోంది .. ఈ సమయంలో దుష్ప్రచారం సరికాదు.. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయి అన్నారు.
Also Read:జుట్టు రాలుతుందా..అయితే మీ కోసమే!

