బీజేపీ మత రాజకీయానికి ఎమ్మెల్సీ కవిత చెక్..!

137
kavitha mlc
- Advertisement -

ముల్లును ముల్లుతోనే తీయాలంటారు..వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు..తెలంగాణలో మతం పేరుతో రచ్చ రాజకీయం చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్ వంటి నేతలకు చెక్‌ పెట్టేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. ఇక అయోధ్య రామమందిరం పేరుతో కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రామమందిరం పేరుతో బీజేపీ నేతలు చేస్తున్న విరాళాల లెక్కలు అడిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసి హిందూత్వ సెంటిమెంట్‌ను రగిలించడానికి బండి సంజయ్‌ బ్యాచ్ ప్రయత్నించింది.

అంతకు ముందు కాషాయకండువాలు వేసుకుని ఇంటింటికి తిరిగి విరాళాలు వసూళ్లు చేయడం ఏంటి..విరాళాల పుస్తకాలు ఇస్తే మేం కూడా సేకరిస్తాం అన్న మెట్‌పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుపై కూడా దాడి చేసేందుకు కాషాయ మూకలు ప్రయత్నించాయి. అసలు హిందూత్వానికి చాంఫియన్లు మేమే అని బీజేపీ నేతలు ఫీల్ అవుతారు..కాని సరిగా సీఎం కేసీఆర్‌లా బీజేపీ నేతలు ఎవరూ ఒక్క యాగం చేసింది లేదు..హిందూ దేవాలయాలకు ఏనాడు కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చింది లేదు.. బీజేపీ రాష్ట్రాలలో కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌లా యాదాద్రి వంటి అత్యద్భుత దివ్యక్షేత్రాన్ని నిర్మించింది లేదు. సీఎం కేసీఆర్‌ను మించి హిందూత్వ వాది ఎవరూ ఉండరు..ఆయనకున్న ఆధ్యాత్మికత, దైవభక్తి ఏ బీజేపీ నేతలో కనిపించదు..కాని బీజేపీ నేతలు మాత్రం పదే పదే హిందూత్వాన్ని భుజాన వేసుకుని జై శ్రీరాం అంటూ మతచిచ్చు రేపి చలికాచుకుంటున్నారు.

అయితే ఎమ్మెల్సీ కవిత సరికొత్త రాజకీయంతో బీజేపీ మత రాజకీయానికి చెక్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయాన్ని దర్శించుకున్న కవిత కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇటీవల కాశీ సమీపంలోని హనుమాన్ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఆలయ ప్రముఖులు కొండగట్టు అంజన్న ఆలయ ప్రాశస్త్యం గురించి చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఈసారి చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతిల సందర్భంగా 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. కొండగట్టు ఆలయ కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రామబంటు అయిన హనుమాన్‌‌ ఆలయాల్లో చాలీసా పారాయణం నిర్వహించడం ద్వారా.. హిందూత్వం అంటే బీజేపీనే అని భ్రమలు కల్పిస్తున్న కాషాయనేతలకు కవిత సరికొత్త స్ట్రాటజీతో షాక్ ఇవ్వబోతున్నారు. మొత్తంగా జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో బీజేపీ చేస్తున్న మతరాజకీయానికి కవితమ్మ చెక్ పెట్టబోతున్నారు. ఎమ్మెల్సీ కవిత తాజా ఎత్తుగడతో బండి సంజయ్, ఎంపీ అర్వింద్ వంటి బీజేపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ తగిలినట్లైంది.

- Advertisement -