Kavitha:ఇది సీబీఐ కస్టడీ కాదు..బీజేపీ కస్టడీ

25
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 23 తేది వరకు రిమాండ్ విధించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. సీబీఐ కస్టడీ ముగియడంతో ఇవాళ కవితను కోర్టులో హాజరుపర్చగా తొమ్మిది రోజులు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. దీంతో మరోసారి అధికారులు కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు.

కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడిన కవిత..ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేండ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని, వాళ్లు కొత్తగా అడిగేందుకు ఏం లేదని కవిత తెలిపారు.

గత నెల 16న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈడీ కేసులో ఇప్పటికే కవిత తీహార్ జైలుకు వెళ్లారు. సీబీఐ అధికారులు తీహార్ జైలులోనే కవితను ఈనెల 11న అరెస్టు చేశారు. మూడు రోజుల కస్టడీ విచారణ అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు 23వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Also Read:వామ్మో ‘హెపటైటిస్ వ్యాధి’.. జాగ్రత్త!

- Advertisement -