సీఎం రేవంత్‌కు రక్షణ కవచంలా బీజేపీ

4
- Advertisement -

ఏడాది పాలనలో కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఘోరంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన కవిత…గారడి మాటలో కేవలం ఒక శాతం ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు బంధుపై మాటలు తప్ప చేతలు లేవు…కేసీఆర్ పథకాలే తప్ప కొత్త పనుల జాడ లేదు అన్నారు.

నేరాలు ఘోరాలు పెరిగాయి….పోలీసులు కాంగ్రెస్ నేతలకే రక్షకులుగా మారారు అని ఆరోపించారు. ఆడపిల్లలు మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిషన్ పెట్టాలని…సీఎం రేవంత్ సమీక్ష జరపాలన్నారు. రేవంత్ పాలనలో మళ్లీ ఎన్ కౌంటర్లు….కేసీఆర్ పాలనలో ఎన్ కౌంటర్లు లేవు అన్నారు.

తుపాకీ చప్పుళ్ళు లేవు….భూ భారతి చట్టం పై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ తోక పార్టీ…సీఎం రేవంత్ కు బీజేపీ నేతలు రక్షణ కవచం గా నిలుస్తున్నారు అని మండిపడ్డారు.

Also Read:మోదీకి చైతూ కృతజ్ఞతలు

- Advertisement -