ఢిల్లీ బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో ఎమ్మెల్సీ కవిత

3
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో తీహార్ జైలు నుండి బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. తీహార్‌ జైలు నుండి బయటకు వచ్చిన కవితకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్‌ సురేశ్‌రెడ్డి, ఎంపీలు దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు స్వాగతం పలికారు.

అనంతరం ఢిల్లీ వసంతవిహార్‌లోని తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. తెలంగాణభవన్‌లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం కేటీఆర్‌..కవితకు స్వీట్ తినిపించగా పార్టీ నాయకులతో సమావేశం అయ్యారు. కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు కవిత. ఢిల్లీకి స్వచ్ఛందంగా వచ్చి కుటుంబానికి, పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు కేటీఆర్.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, వీ శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, డాక్టర్‌ సంజయ్‌, కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, పాడి కౌశిక్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, అనిల్‌జాదవ్‌, బీ లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌ తదితరులు ఉన్నారు.

Also Read:CM Revanth: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

- Advertisement -