Kavitha:రేవణ్ణను దేశం దాటించి..మాపై అరెస్ట్‌లా?

26
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ నెల 14వ తేదీ వరకు జ్యూడిషీయల్ కస్టడీని పొడగించింది న్యాయస్థానం. ఈ సందర్భంగా కోర్టు హాలు నుండి బయటకు వచ్చిన కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు.. మాలాంటి వారిని అరెస్టు చేయడం చాలా అన్యాయం అని అన్నారు.ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలన్నారు.

జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్స్‌ స్కాండల్‌ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతోంది. ఎన్నికల ప్రచారం మొత్తం ఈ అంశం చుట్టే తిరుగుతుండగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) బెంగళూరులోని బసవనగుడిలో గల మాజీ ఎమ్మెలే, ప్రజ్వల్‌ తండ్రి రేవణ్ణ ఇంట్లో సోమవారం తనిఖీలు నిర్వహించి కీలక ఆధారాలను సేకించారు.

Also Read:KTR:దేశానికి ఏం చేస్తారో చెప్పండి?

- Advertisement -