పింక్ బుక్ రాస్తున్నం..వదిలిపెట్టం: కవిత

9
- Advertisement -

కాంగ్రెస్ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోతున్న అధికారులను వదలిపెట్టమన్నారు ఎమ్మెల్సీ కవిత. పింక్ బుక్ రాస్తున్నాం అని.. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా.. అధికారులనైనా వదిలిపెట్టేది లేదు అని తేల్చిచెప్పారు.

నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెప్తున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మెయింటెన్ చేస్తాం. పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది అన్నారు. అప్పుడు అందరి సంగతి చెప్తాం అని హెచ్చరించారు.

సోషల్ మీడియాలో చిన్న విమర్శ చేసినా, ప్రశ్నించినా అక్రమ కేసులు పెడుతున్నారు. శ్రీధర్ రెడ్డి అనే కార్యకర్తను దారుణంగా చంపేసినా కూడా పోలీసులు ఇప్పటివరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేయడంలేదు. కాంగ్రెస్ నాయకులు హంతకులకు కొమ్ముకాస్తున్నారు. బీఆర్ఎస్ మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడితే పరమేశ్వర్ అనే కార్యకర్తపై మంత్రి జూపల్లి దాడి చేయించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఇదేం రాజ్యం? కాంగ్రెస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.

Also Read:మహా సీఎం ఫడ్నవీస్‌కు బెదిరింపులు

- Advertisement -