తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అన్నారు ఎమ్మెల్సీ కవిత. మీడియాతో మాట్లాడిన కవిత..రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందన్నారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారు అని…రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి…. తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారు అన్నారు.
కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం…కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. బతుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదు అన్నారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారు…బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరం అని మండిపడ్డారు.
బతుకును ఆగం చేశారు.. బతుకమ్మను మాయం చేశారు, తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలి అనుకుంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నెలకు రాయాలన్నారు. ఉద్యమ కారుల పై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు అని…తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలంటే గన్ పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు.
Also Read:మసాలా టీ తాగుతున్నారా..అయితే?