రష్మిక ఫేక్ వీడియోపై కవిత ఆందోళన

53
- Advertisement -

నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో పై ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సైబర్ ముప్పు నుంచి మహిళలకు రక్షణ కల్పించాలన్నారు. తగిన చర్యల రూపకల్పన కోసం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సైబర్ ముప్పు నుంచి మహిళలను కాపాడాల్సిన తక్షణ అవసరం ఉందని స్పష్టం చేసిన ఆమె…రష్మిక మందన్న పై దుండగులు డీప్ ఫేక్ వీడియోను సృష్టించడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సైబర్ ముప్పు నుంచి మహిళలను రక్షించాల్సిన తక్షణ అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. రక్షణా చర్యలను సమగ్రంగా రూపొందించడం కోసం ప్రత్యేకంగా పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా కవిత విజ్ఞప్తి చేశారు.

Also Read:అనుష్క @ భాగమతి 2

- Advertisement -