జైల్లో పెడతారా..దేనికైనా సిద్ధం: కవిత

230
mlc kavitha
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దేశంలోకి బీజేపీ పాలన వచ్చి ఎనిమిది ఏళ్ళు పూర్తవుతుందని…ఎనిమిది ఏళ్లలో తొమ్మది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారన్నారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, మోడీ కంటే ముందు ఈడీ రావడం సహజం అన్నారు.

ఎన్నికలకు ముందు ఈడీలతో సోదాలు చేయించడం కామన్ అని…టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించడం, బీజేపీ నీచ రాజకీయ ఎత్తుగడ అన్నారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే సమాధానం చెబుతాం…ఈడీలకు, సీబీఐలకు భయపడేది లేదన్నారు.

జైల్లో పెట్టడం కంటే, ఎక్కువ చేసేది ఏమి లేదు…మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పంధాన్ని మార్చుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు…తగిన సమయంలో బుద్దిచెబుతారన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -