40 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం పనిచేశా..ఫిరాయింపులు సరికాదు!

14
- Advertisement -

కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పది నియోజక వర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అన్నారు. టీడీపీ నుంచి నా రాజకీయ జీవితం ప్రారంభం అయ్యిందన్నారు. ఇందిరా గాంధీ మరణం తరువాత నేను కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యాను…40 ఏండ్లుగా కాంగ్రెస్‌ కోసం పని చేస్తున్నాను.. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు.

పార్టీ మారాలంటూ BRS నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నేను పార్టీ వీడలేదు…నేను పార్టీ కోసం పని చేశాను.. BRS దౌర్జన్యాలను నేను మండలిలో ప్రశ్నించాను అన్నారు. నేను సభలో ప్రస్తావించని ప్రజా సమస్యే లేదు. ప్రతీ సమస్య పై సభలో మాట్లాడాను అన్నారు. నేను అసెంబ్లీ ఎన్నికల్లో గెలవక పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.

ఎమ్మెల్యేలు ఎందుకు పార్టీ ఫిరాయిస్తున్నారో తెలవదు కానీ.. పార్టీ మారుతున్నారు…జగిత్యాల అంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే జీవన్ రెడ్డి.. అనే విధంగా ఒక తల్లి లాగా పార్టీని భావించాను అన్నారు. పదేండ్ల BRS అక్రమ పాలనను నేను వ్యతిరేకించాను.. కానీ ఇప్పుడు వాళ్లే మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చారు…పదేండ్లు కాంగ్రెస్ కార్యకర్తల పై కేసులు పెట్టిన వాళ్లు… మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి పదవులు పొందుతున్నారు అన్నారు.

Also Read:జగన్ వర్సెస్ షర్మిల..ఆస్తుల కోసం లేఖాస్త్రాలు!

పార్టీ పిరాయింపులకు ముఠా నాయకుడు ఉన్నాడు.. పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ఇంట్లో భేటీ అయ్యి ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..పార్టీ మారిన నియోజక వర్గాల్లో.. పది మంది ఎమ్మెల్యేలు లేకపోతే ప్రభుత్వం కొనసాగదా? అన్నారు. రాహుల్ గాంధీ చెప్పింది ఏంటి… మనవాళ్ళు చేస్తున్నది ఏంటి..కేసీఆర్ చేసింది.. మన వాళ్ళు మళ్ళీ అదే చేస్తున్నారు అన్నారు.

- Advertisement -