గురుకుల సిబ్బందికి చివాట్లు పెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు జీవన్ రెడ్డి.ప్రభుత్వం నుండి బిల్లులు తీసుకుంటున్నారు. పిల్లలకు సరిపడా భోజనం పెట్టడానికి ఏంటి కష్టం అని ప్రశ్నించారు.
రెండు గిన్నెల నిండా అన్నం వండితే పిల్లలకు సరిపోద్ది.. ఒక గిన్నెలో అన్నం చేసి సరిపడా భోజనం ఎందుకు పెట్టడం లేదు అని అడిగారు. అన్నం ఉడకలేదు… నీళ్ల పప్పు, నీళ్ల చారు పిల్లలకు ఎందుకు వడ్డిస్తున్నారు? అని మండిపడ్డారు.
మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా, నెలలో ఒకే రోజు నాన్ వెజ్ పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 లీటర్ల పెరుగు వాడాల్సి ఉండగా, కేవలం 6 లీటర్ల పెరుగుతో సరిపెడుతున్నారని గురుకుల సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
Also Read:డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ..Suriya45