ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అలకపాన్పు!

24
- Advertisement -

అనైతికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీరును సొంత పార్టీ నేతలే తప్పుబడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం పార్టీ ఫిరాయింపులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

తనకు తెలియకుండా జగిత్యాల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ని పార్టీ చేర్చుకోవడంపై జీవన్‌ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ నుంచి తన జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పటికీ తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డి ఇంటికి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. వారంతా పార్టీ తీరును తప్పుబడుతూ రాజీనామాలకు సిద్ధమైనట్లు తెలుస్తోండగా జగిత్యాల కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ కో అర్డీనేటర్ పదవికి వాకిటి సత్యం రెడ్డి రాజీనామా చేశారు.

Also Read:మూవీ రివ్యూ..సందేహం

- Advertisement -