తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీకి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణలో రెండు టీచరు ఎమ్మెల్సీ, ఒక గ్రాడేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
తొలుత ఒక్కో అభ్యర్థికి లభించిన మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు. 50 శాతం ప్లస్ 1 ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. అలా జరగకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తదుపరి ఎలిమినేషన్ రౌండ్ ఆరంభమవుతుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఫలితాలు అలస్యం అయ్యే అవకాశం ఉంది.
కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 25 మంది బరిలో నిలిచారు. వారిలో ప్రధాన పోటీ పిడిఎఫ్ అభ్యర్థి కెఎస్.లక్ష్మణరావు, టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మధ్య నెలకొంది. ఏపీలోని మూడు శాననమండలి స్థానాలకు గత 27న ఎన్నికలు జరిగాయి.
ఇక తెలంగాణలో రెండు టీచర్, ఒక పట్ట భద్రుల స్థానానికి ఎన్నిక జరుగుతోంది.
Also Read:కర్తవ్యాన్ని మరిచింది ఎవరు?:సీఎంపై హరీశ్ ఫైర్