కోహెడ పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన ఎమ్మెల్యేలు..

247
- Advertisement -

అబ్దుల్లాపూర్ మెట్టు కోహెడ రెవెన్యూ పరిధిలో మామిడి కొనుగోళ్ల కోసం నిర్మించిన తాత్కాలిక షెడ్ లు ఈ రోజు వచ్చిన గాలిదూమరానికి వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది ఘటన స్థలానికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మల్యే మంచిరెడ్డి మరియు ఎల్ బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడ ప్రకృతి వైపరిత్యానికి జరిగిన నష్టాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే లు మాట్లాడుతూ.. లక్‌డౌన్‌ కారణంగా అన్ని రాష్ట్రాలలో ప్రధాన మార్కెట్ లు బంద్ ఉండటంతో అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి మామిడి తీసుకుని రైతులు రావడం జరుగుతుందని గతంలో మాదిరిగా గడ్డి అన్నారం మార్కెట్‌లో కొనాలంటే అక్కడ ఉన్న చిన్న ప్రాంతంలో ఇంతమంది రైతులు,ట్రేడర్స్ వాళ్ళు,మాములు కొనుగోలుకు వచ్చే వారు వస్తే కరోన మహమ్మరి ఎక్కువవుతుంది.

అందుకే తాత్కాలికంగా షెడ్ లు నిర్మించి గత 8 రోజులుగా కొనుగోల్లు చేయటం జరుగుతుందని ప్రకృతి వైపరిత్యము కారణంగానే ఇది జరిగిందని ఇక్కడ గాయాలైన రైతుల్ని ఆదుకుంటామని వారికి కావాల్సిన చికిత్స ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ఇక కూలిన షెడ్ లని తొలగించి అనంతరం ఎవరికి నష్టం జరిగింది అన్న అంశాల్ని అంచనా వేసి వారికి ప్రభుత్వం నుండి తప్పక నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు.

- Advertisement -