రుణమాఫీ అయ్యేదాక నిద్రపోనివ్వం:వివేకానంద

7
- Advertisement -

ఆసెంబ్లీ సమావేశాల్లో రైతు రుణ మాఫీ పై రైతు భరోసా పై చర్చ పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు ఎమ్మెల్యే వివేకానంద. బడ్జెట్ పై ,ద్రవ్య వినిమయ బిల్లుపై ,వ్యవసాయ డిమాండ్ల పై మాట్లాడినపుడు మా ఎమ్మెల్యేలు రైతు రుణ మాఫీ ,రైతు భరోసా ల పై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వివేకానంద….అయినా సీఎం ,డిప్యూటీ సీఎం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు అన్నారు.

అందుకే మా నేత కేసీఆర్ బడ్జెట్ ను ట్రాష్ ,గ్యాస్ అన్నారు ,పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రైతులను మోసం చేశారు అన్నారు. ..మా బౌరం పేట ప్రాథమిక సొసైటీ లో 632 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 14 మందికే మాఫీ అయ్యిందన్నారు. వాగ్ధాన భంగాలు సీఎం రేవంత్ రెడ్డి కి అలవాటు గా మారిపోయాయన్నారు. .అసెంబ్లీ లో మాపై సీఎం రేవంత్ విషం చిమ్మారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఏం చేస్తున్నారో చెప్పలేదు..రైతు రుణమాఫీ అయ్యేదాకా సీఎం రేవంత్ ను నిద్రపోనివ్వం అన్నారు.

ఆసెంబ్లీ లో బజారు భాష మాట్లాడిన ఎమ్మెల్యేలకు బాసట గా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి తన తీరు ఏమిటో చెప్పకనే చెప్పారు ..ఇలాంటి దిగజారుడు సీఎం ను నేనెపుడూ చూడలేదు అన్నారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరేవరకు బీ ఆర్ ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని….బడ్జెట్ లో రైతుల కిచ్చిన హామీలు నెరవేరేందుకు దగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు అన్నారు. ఇంత మోసపూరితమైన ప్రభుత్వం దేశం లో మరొకటి లేదు అని విమర్శించారు.

Also Read:KTR:పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు

- Advertisement -