వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే!

1
- Advertisement -

గత అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి పొంగులేటి కుంభకోణాలను సాక్ష్యాలతో సహా బయటపెడితే.. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేసిండు అన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వివేకానంద..ఈ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామనే భయంతో, అనవసరమైన అంశంపై రాద్ధాంతం చేస్తూ మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల ప్రవర్తనను ఖండించాల్సింది పోయి,
మంత్రి సీతక్క తోటి మహిళలను అవమానించడం దారుణం అన్నారు.

అసెంబ్లీ జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి స్వయంగా పంపిస్తున్నారని ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంపై దాడులకు ఉసిగొల్పుతున్నాడు రేవంత్ రెడ్డి ..ఆ దృశ్యాలను మీడియా సాక్షిగా చూపెట్టారు జగదీష్ రెడ్డి.

గతంలో అనేకసార్లు నీచానికి దిగజారి కేసీఆర్ చావును కోరిన రేవంత్ రెడ్డి..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, వీర్నపల్లి శంకర్.. రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే మాట్లాడారు అన్నారు ప్రశాంత్ రెడ్డి.ఇవి శంకర్ మాట్లాడిన మాటలు కావు.. రేవంత్ రెడ్డి మాటలే…వీర్నపల్లి శంకర్, వేముల వీరేశంపై స్పీకర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి.కేసు నమోదు చేసి, వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలి.రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Also Read:BB10 హౌస్‌లోకి బాలు-మీనా!

- Advertisement -