వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేశారు , మరి వన్యప్రాణులను హింసించిన రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టండి అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. మీడియాతో మాట్లాడిన వివేకా.. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోంది అన్నారు.
కోర్టు సెలవులు ఉన్నప్పుడు ఆఅ భూముల్లో చెట్లను గుంటనక్కల్లా కొట్టారు. రాష్ట్రంలో గుంటనక్కల పాత్ర ఎవరు పోషిస్తున్నారో ప్రజలకు తెలిసింది. పదివేల కోట్ల రూపాయలకు కక్కుర్తి పడి ప్రజలను తప్పుదారి పట్టించారు, దొంగల్లా దొరికిపోయారు. అని ఎద్దేవా చేశారు. పది వేల కోట్ల ఆర్ధిక అవకతవకల్లో బీజేపీ ఎంపీ పాత్ర ఉంది కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయడం లేదు అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది…. రాములు నాయక్ కోడలికి మార్కులు ఎట్లా వచ్చాయని ప్రశ్నించడం తప్పా? చెప్పాలన్నారు. కాంగ్రెస్ వైఫ్యల్యాలపై ప్రశ్నించిన పాడి కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు అన్నారు.
Also Read:OG:పవన్ ‘ఓజీ’ క్రేజీ అప్‌డేట్

