జగిత్యాల జిల్లా కోరుట్ల లో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా ఎస్సారెస్పీ కాలువ వద్దకు వెల్లిన టక్కర్ గిరీష్ సింగ్ అనే వ్యక్తి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. గిరీశ్ జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వద్ద పీఏ గా పనిచేస్తున్నారు. పట్టణానికి చెందిన ముగ్గురు మిత్రులు విజయ్,బాలన్, రామకృష్ణ రెడ్డి లతో కలిసి గిరీష్ ఎస్సారెస్పీ కెనాల్ వైపు విందు చేసుకొని తిరిగి వస్తుండగా ఎస్సారెస్పీ నీటి ప్రవాహాన్ని చూసి సరదాగా ఈత కొడదామని కాల్వలోకి దిగిన గిరీష్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు తెలిపారు.
స్నేహితులు వద్దని వారిస్తున్నా సరదాగా ఈత కొట్టేందుకు ప్రాజెక్టు కాకతీయ కాల్వలో దిగిన గిరీశ్ ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు, పోలీసులు కూడా గజ ఈతగాళ్లతో కలిసి అంతర్గాం, థరూర్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. జగిత్యాల పట్టణానికి చెందిన గిరీష్ పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగి. గిరిషి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రమణ జగిత్యాలకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పీఏ గా విధులు నిర్వహించారు.