కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి అని అన్నారు.పారిశుద్య కార్మికులతో పల్లెలు,పట్టణాలు శుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు.వారి త్యాగాలు మరువలేనివి అని అన్నారు.కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు పల్లెలను, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో వారీ పాత్ర మరువలేనిదని అన్నారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల,పోలీసుల, విలేకరుల,ఇతర ప్రభుత్వ అధికారుల సేవలు,త్యాగాలు మరువలేనివి.వారికి నా సెల్యూట్ చేస్తున్నా,వారికి నా పాదాభివందనం చేస్తున్నాఅని అన్నారు.

కరోనా వైరస్ నియంత్రణ కోసం ,వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికుల, పోలీసుల, విలేకర్ల సేవలు, త్యాగాలు మరువలేనివని అన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు సహకరించాలని కోరారు. అవసరానికి మాత్రమే బయటకు రావాలని సూచించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతిలో భాగంగా మురికి కాల్వలను శుభ్రం చేయడం జరిగిందని తెలిపారు.రోడ్డుకు ఇరువైపులా ఉన్న, కాలనీల్లో ఉన్న చెత్త ను తొలగించడం జరిగిందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. లాక్ డౌన్ సందర్భంగా తీసుకుంటున్న చర్యల పట్ల ప్రధానమంత్రి,కేంద్ర మంత్రులు అభినందిస్తున్నారని తెలిపారు. వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు,పోలీసుల వారి కుటుంబాలను విడిచిపెట్టి త్యాగం చేస్తున్నారు. వారి త్యాగాలను గౌరవించి ప్రజలు బయటకు రావద్దని రెండు చేతులా దండం పెడుతున్న. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని కోరుతున్నాను అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.

