- Advertisement -
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కేసుల సంఖ్య 77 వేలు దాటగా మృతుల సంఖ్య 615కి చేరాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారీన పడ్డారు.
ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా సోకింది. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా,వివేకానంద గౌడ్,జీవన్ రెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డి,నల్లమోత భాస్కర్ రావులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.
- Advertisement -