హుజూర్ నగర్‌ అభివృద్ధే నా ధ్యేయం..

532
MLA Shanampudi Saidi Reddy
- Advertisement -

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం తర్వాత తొలిసారి నియోజకవర్గ కేంద్రంలో రేపు (సోమవారం,జూన్ 29)పర్యచనున్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్ మంత్రి కె.టి.రామారావు. ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన పలు హామీల అమలు దిశగా ప్రారంభోత్సవాలు,శంఖు స్థాపనలు చేయనున్నారు మంత్రి కేటీఆర్. హుజూర్ నగర్ నియోజకవర్గంలో రేపు (సోమవారం ,జూన్ 29 ) మంత్రి కేటీఆర్ పర్యటనకు సంబంధించిన కార్యక్రమాల ఏర్పాట్లును హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పరిశీలించారు.

అనంతరం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మీడియాతో మాట్లాడారు. హుజూర్ నగర్ ప్రజల చిరకాల కోరిక అయిన ఆర్డిఓ ఆఫీస్‌తో పాటు అలాంటి మరిన్ని ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్ కు, యువ నాయకులు కేటీఆర్ కు, మంత్రి జగదీష్ రెడ్డికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలని నెరవేర్చిన, చేసి చూపించిన ఘనత కూడా మన టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో రేపు (సోమవారం ,జూన్ 29 )జరగనున్న అభివృద్ధి కార్యక్రమాలు కేటీఆర్ చేతులమీదుగా సుమారు గా రూ.48 కోట్లు నిధులతో హుజూర్ నగర్, నేరేడు చర్లలలో అభివృధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్ట బోతున్నాం. ఆర్డీవో ఆఫీస్ ప్రారంభం.. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది.

హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా ధ్యేయం. నిరుద్యోగ యువతకు కమ్యూనికేషన్ స్కిల్స్ కొరకు శిక్షణ ఇచ్చి ఐటీ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో హుజూర్ నగర్ నియోజకవర్గం నిజమైన అభివృద్ధి ఇపుడే ప్రారంభమైంది .ఇక పై శరవేగంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే శానం పూడి సైది రెడ్డి పేర్కొన్నారు.

దయచేసి కార్యకర్తలకి ముఖ్య విన్నపం..

కార్యకర్తలకు ఎవరికి సమావేశానికి అనుమతి లేదు. దయచేసి గమనించగలరు. కరోనా ప్రబలుతున్న వేల అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తే పరిస్థితి ఇబ్బంది కరంగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరు గమనించాలి ఎమ్మెల్యే కోరారు.

- Advertisement -