- Advertisement -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ బీజేపీ అభ్యర్థికి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు సీతక్క. కోమటిరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ పనికిమాలిన చర్య అని అన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు కోమటిరెడ్డి జవాబు చెప్పాల్సిందేనని సీతక్క డిమాండ్ చేశారు. బంధాలకతీతమే రాజకీయాలు.. నిబద్ధత గల రాజకీయాలు చేయాలనుకుంటే.. పార్టీ నిబంధనలు, సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డిని పక్కన పెట్టాల్సిందేనని తెలిపారు. తమ్ముడి గెలుపే ముఖ్యమైతే.. కాంగ్రెస్ కండువాను తీసి పక్కనపెట్టి, బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలని ధ్వజమెత్తారు. ఆపదలో అండగా ఉండాల్సింది పోయి ఆస్ట్రేలియాకు పోవడం ఏంటని నిలదీశారు.
- Advertisement -