ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి- ఎమ్మెల్యే

424
- Advertisement -

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొన్నసాగుతున్న విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఎవరూ అకలితో పస్తులుండకూడాదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ నిత్యవసర సరుకులు అందించే విధంగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 500 రూపాయలు అందింస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో వివిధ వర్గాలకు చెందిన 500 మందికి బియ్యం,నిత్యవసర సరుకులు అందజేశారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి.

dubbaka mla

అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం నిరుపేద ప్రజలందరినీ ప్రభుత్వపరంగా ఆదుకుంటాం. దుబ్బాకలో ఆర్థికంగా కలిగి ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ ఆపద సమయంలో బీద ప్రజలకు తమ రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలన్నారు. నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ విపత్కర పరిస్థితులలో మరింత మంది దాతలు ముందుకు వచ్చి పేద ప్రజలను ఆదుకోవాలి. కరోన వైరస్ బారిన పడకుండా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.

- Advertisement -