కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన రోజా..

327
- Advertisement -

నగరి ఎమ్మెల్యే రోజా ఇటీవల విజయవాడలో ఇల్లు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె భర్త సెల్వమణితో కలిసి గృహప్రవేశం చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజధానిగా దగ్గరగా రోజా దంపతులు ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితవర్గాలు చెప్పాయి.

MLA Roja

2014 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరిలోనే ఇంటిని నిర్మించుకున్నారు. తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమె నగరి నుంచి ఘనవిజయం సాధించారు.

ఇక నవరత్నాల అమలును కూడా మంత్రులను అప్పజెప్పితే వాళ్లకు పనిభారం పెరుగుతుందని, అందుకే మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు అప్పగిస్తే వాళ్లు దాన్ని పర్‌ఫెక్ట్‌గా చేస్తారని.. పైగా, రోజా అయితే సమర్థవంతంగా ఆ పదవిని నిర్వహిస్తారని జగన్ అనుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -