వైసీసీ అధినేత జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి,ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్న పవన్ వెంటనే బయటకు వస్తారంటూ ఎద్దేవా చేశారు. పవన్ ఓ ప్యాకేజీ ఆర్టిస్టు అని దుయ్యబట్టిన రోజా…తప్పులు చేస్తున్న టీడీపీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీసింది.
చిరంజీవిని మోసం చేసింది పవన్ కల్యాణేనని రోజా ఆరోపించింది. చిరంజీవికి అన్యాయం చేసినందుకు పవన్ కల్యాణ్ ముందు తనను తాను శిక్షించుకోవాలని డిమాండ్ చేశారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని భావించి, పరిగెత్తుకు వచ్చి, నువ్వు యువనేతగా ప్రచారం చేశారు. మీ అన్న 18 సీట్లు మాత్రమే గెలిచాడనగానే, మీ అన్నను గాల్లోకి వదిలేసి, నీ పాటికి నువ్వు షూటింగ్ లకు వెళ్లి అన్యాయం చేశావు. ముందు నిన్ను నువ్వు శిక్షించుకో అని విమర్శలు గుప్పించారు.
ఓటుకు నోటు నుంచి ఎన్నో కేసుల్లో ఏ ఒక్కదానిలో విచారణ జరిగినా చంద్రబాబు జీవితాంతం చిప్పకూడు తినాల్సిందేనని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరిట రూ. 1.20 లక్షల కోట్లు అప్పుతెచ్చుకుని, ఆ డబ్బులను కమిషన్ల రూపంలో వెనకేసుకుని విపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.
కృష్ణానదిలో ఓ బోటు బోల్తా పడిందన్న విషయం ఎక్కడో లండన్ లో ఓ విద్యార్థి చెబితే తెలిసిందంటే, అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా అని పవన్‌ను సూటిగా ప్రశ్నించింది రోజా.