సూపర్ స్టార్ మహేష్‌పై రోజా ప్రశంసలు..

146
- Advertisement -

ప్రముఖ నటి, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి.. సూపర్ స్టార్ మహేష్‌ బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. మహేష్‌ చేసే మంచి పనుల గురించి చెప్పనవసరం లేదు.. మహేష్‌ కేవలం సినిమాలతోనే సరిపెట్టుకోకుండా, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మనసున్న మహరాజుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో ఆయన ఇప్పటివరకు వందల సంఖ్యలో చిన్నారులకు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. అందుకు అవసరమైన ఖర్చును భరిస్తూ నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు అండగా నిలిచాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఓ కొత్త ఫౌండేషన్‌ను మొదలుపెట్టి మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయన రెయిన్ బో హాస్పిటల్స్ గ్రూప్‌కు చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌తో సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. అయితే దీనిపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్… నీకు హ్యాట్సాఫ్ అంటూ మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ మేరకు రోజా సోషల్ మీడియాలో స్పందించారు. రెయిన్ బో హాస్పిటల్స్ చేపట్టిన కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతున్న వీడియోను కూడా ఆమె పోస్ట్‌ చేశారు.

- Advertisement -