- Advertisement -
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్బవించి ఇవవైసంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై తెరాస పార్టీ జెండాను ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఎగరవేశారు. అనంతరం రక్తదాన శిబిరంలో సుమారు వంద మందితో రక్తదాన కార్యమాన్ని నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి పైన పార్టీ జెండాను ఎగురవేయాలని సీఎం కేసీఆర్, కేటీఆర్ సూచనల మేరకు అన్ని మండలాల్లో కార్యకర్తల ఇండ్లపై పార్టీ జెండాలను పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -