- Advertisement -
శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపు రావు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -