తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మరి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగర వాసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఈ మేరకు రాజాసింగ్ ట్వీట్టర్ ద్వారా బీజేపీ కార్యకర్తలకు సందేశం ఇచ్చారు.
నిన్న నా గన్ మెన్ ను కరోనా పాజిటివ్ వచ్చింది. నేను, నా కుటుంబ సభ్యులుకూడా టెస్ట్ లు చేయించుకున్నాం. మరో రెండు రోజుల్లో రిపోర్టు రావచ్చు. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, ఆయుష్ మంత్రాలయ గైడ్ లైన్స్ పాటించాలని కోరుతున్నట్లు రాజాసింగ్ ట్వీట్ చేశారు. కాగా తెలంగాణలో పలువురు ప్రజా ప్రతినిధులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు ప్రజా ప్రతినిధులు అలర్ట్ గా ఉన్నారు.