మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నా?:రాజగోపాల్ రెడ్డి

15
- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమేనన్నారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. చిట్ చాట్‌గా మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. 16నెలలుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నఅన్నారు. నాకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్న .. పార్టీ నాకు హామీ ఇచ్చింది…హామీ మేరకు అడుగుతున్న అన్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఉగాదికి కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం ఉండగా ప్రస్తుతం నలుగురికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ఈసారి మంత్రివర్గంలో తీసుకునే వారిలో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,జీ వివేక్, శ్రీహరి ముదిరాజ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డికి చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది.

Also Read:కాంగ్రెస్ పాలనలో అధోగతి: కేటీఆర్

- Advertisement -