జానారెడ్డి పరువు తీసేసిన రాజగోపాల్‌ రెడ్డి..!

229
janareddy
- Advertisement -

కోమటిరెడ్డి బ్రదర్స్‌…రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా నల్గొండ రాజకీయాల్లో తమదైన పాత్ర పోషించారు. ముఖ్యంగా వీరిపై కాంగ్రెస్ కార్యకర్తల్లో నమ్మకం ఎక్కువా.

అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కోమటిరెడ్డి బ్రదర్స్‌ ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిపై నమ్మకం సడలించేలా చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే ఉంటూ తాను బీజేపీలో చేరుతానని ప్రకటించడంపై సొంతపార్టీ నేతలే కాదు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే ఒకసారి కాదు పలుమార్లు ఇదే ప్రకటన చేసిన కాంగ్రెస్‌ మాత్రం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం సీఎల్పీ ఆఫీస్‌లో జేసీతో చిట్ చాట్ సందర్భంగా తాను బీజేపీలో చేరుతున్నానని తెలపగా భట్టి వారించే ప్రయత్నం చేశారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిని ఆసరా చేసుకునే సాగర్ ఎన్నికల వేళ రాజగోపాల్ రెడ్డి..సీనియర్ నేత జానారెడ్డి పరువు తీసేశారు.

తనని బీజేపీ లోకి రమ్మని ఇప్పటికీ సంప్రదింపులు జరుగుతున్నాయని, నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయమని కొన్ని రోజుల నుండి నన్ను బీజేపీ నాయకులు అడుగుతున్నారు చెప్పారు. బీజేపీ నుంచి తాను సాగర్ లో పోటీ చేస్తే పోటీ బీజేపీ- టీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని..జానా మూడో స్ధానానికే పరిమితమవుతారని కాంగ్రెస్ పార్టీ గాలి తీసేశారు. జానాకు సాగర్‌లో అంతసీన్ లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నా కాంగ్రెస్ నేతలు మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ తమకున్న ఛరిష్మాను తామే చెరిపేసుకుంటున్నారని…రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -