ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ.. నోటిఫికేషన్ రిలీజ్

12
- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ 5 స్థానాలకు నేటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి నోటీఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ.. ఈ నెల 20న పోలింగ్ ఉండనుంది. పోలింగ్ రోజు సాయంత్రమే కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

ఈనెల 29న 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈనెల 10 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుండగా 11న నామినేషన్ల పరిశీలన.. 13న నామినేషన్ల ఉపసంహరణ ఉండనేంది.

శాసనసభలో పార్టీలకున్న సంఖ్యా బలాన్ని బట్టి అధికార కాంగ్రెస్‌ పార్టీకి 4 ఎమ్మెల్సీ సీట్లు, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ సీటు దక్కే అవకాశం ఉంది.

Also Read:కర్తవ్యాన్ని మరిచింది ఎవరు?:సీఎంపై హరీశ్‌ ఫైర్

- Advertisement -