బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు

0
- Advertisement -

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు వెళ్లారు. అక్కడ గుండె పోటు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందారు. ఇక పార్టీ పెద్దలు సైతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇవాళ సాయంత్రి సికింద్రాబాద్‌కు రానున్నారు పద్మారావు.

Also Read:ప్రభుత్వానికి సర్పంచ్‌ల బహిరంగ లేఖ

- Advertisement -