నందమూరి నట సింహం విశ్వరూపం స్క్రీన్ పైనే కాదు.. బయట కూడా కనిపిస్తూనే ఉంది. సాధారణంగా బాలయ్య బాబుకు కోపం ఎక్కువని ఇప్పటి వరకు వాళ్లూ వీళ్లూ చెబితే వినటమేగానీ.. ఇప్పుడు మాత్రం అందరికీ చూపించేశారు బాలకృష్ణ. ఇటీవల బాలకృష్ణ తన కొత్త సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అసిస్టెంట్ ను కొడుతూ.. అతడితో బూట్లు విప్పించుకుంటూ కెమెరాల కంటపడ్డారు.
అంతే కాదు ఈ గొడవ ఇక్కడితో ఆగిపోలేదు. ఈసారి తన అభిమానిని కొట్టి బాలకృష్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి తన అభిమానిని కొట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఈ ఘటన జరిగింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి బాలకృష్ణ అక్కడికి వెళ్లారు. ఆయనను చూడగానే అభిమానులంతా చుట్టుముట్టారు. అందులో ఓ వ్యక్తి ఆయనపై పడటంతో కోపం ఆపుకోలేకపోయారు. అతనిపై చేయి చేసుకొని సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గతంలోనూ బాలయ్య తన ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి. తనతో సెల్పీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిని పక్కకు తోసేసిన వీడియో ఒకటి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. బాలయ్య ప్రవర్తనపై కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఆగ్రహానికి గురైన ఓ అభిమాని బాలకృష్ణకు లేఖ కూడా రాశాడు.
ఆ అభిమాని లేఖలో రాసిన విషయం ఏంటంటే…`అన్నా… రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా!` అనే టైటిల్‌తో ఉన్న ఈ లేఖలో వివిధ సందర్భాల్లో ఆయన అనుచిత ప్రవర్తనను విమర్శిస్తూ, ప్రేక్షకుల విలువను కళ్లకు కట్టినట్లు వివరించాడు. దొరలు, రాజుల కాలం పోయిందని, ప్రేక్షకుడి టికెట్ డబ్బుల మీద బతికే మీరు దొరల్లా ఫీల్ అవకండని లేఖలో ఉంది. ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని ఊరికే అనలేదని, మీ సినిమాని ప్రేక్షకులు బహిష్కరిస్తే వీఐపీలో ఒక్క అక్షరం మిస్సయ్యే పరిస్థితి మీకు వస్తుందని అభిమాని లేఖలో విమర్శించాడు.
https://youtu.be/RbEQzDUfhd8