- Advertisement -
హైదరాబాద్ నుండి పొమ్మనడానికి నువ్వు ఎవడ్రా అని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అన్నారు.
శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా.. హైదరాబాద్ మహా నగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అన్నారు. అందరూ మన బిడ్డలే.. దయచేసి ఆంధ్ర, తెలంగాణ అనే భావం తేవద్దు అని దుయ్యబట్టారు.
హైదారాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకొంటున్నారు.. నగర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయిన మాట్లాడితే ఊరుకునేది లేదు అని తేల్చిచెప్పారు.
Also Read:శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: రేవంత్
- Advertisement -