రైతుల కోసం..ఎమ్మెల్యే రూ.2కోట్ల విరాళం!

4
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.2 కోట్ల చెక్కు అందించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి రూ.2 కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు బత్తుల లక్ష్మారెడ్డి.

ఈ డబ్బుతో లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు ఎమ్మెల్యే. ఇటీవల తన కుమారుడు సాయిప్రసన్న వివాహం కాగా, మిర్యాలగూడలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.

అయితే రిసెప్షన్ రద్దు చేసుకుని, ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేయడానికి ముందుకొచ్చారు ఎమ్మెల్యే. ఈ మేరకు లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read:‘భద్రకాళి’..నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ!

- Advertisement -