పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు చాలా మంచిది దాన్ని అమలు చేయాలన్నారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పార్టీలు మారితే వారి సభ్యత్వాలు ఆటోమేటిగ్గా రద్దు అవ్వాలన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు పార్టీని,నియోజకవర్గ ప్రజలను మోసం చేసినట్టు అలాంటి వారిపై సభ్యత్వం రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకుంటే మంచిది అమలు అయితే ఇంకా సంతోషం అన్నారు. పార్టీ మారిన వారు పార్టీ ఇష్టం లేకపోతే పదవికి రాజీనామా చేయాలన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్ బాద్, కృష్ణ గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకు రైతులు ,సామాన్య జనాలు నష్ట పోయారు అన్నారు. తెలంగాణ భారత దేశంలోనే ఉంది.కేంద్రం మన రాష్ట్రం మీద వివక్ష చూపకూడదు…మానవత్వం తో నష్ట నివారణ కోసం కేంద్రం రాష్ట్రానికి సహాయం చేయాలన్నారు. జాతీయ విపత్తు కింద ప్రకటన చేసి రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు 6,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి..కానీ మా అంచనా ప్రకారం 10,000 కోట్లు ఇవ్వాలన్నారు.
ఇళ్లు కూలిపోయిన, దెబ్బతిన్న ఇళ్లకి ,ఎకరం పంట నష్ట పోతే 10,000 రూపాయలు ఇవ్వడం ఏంటి నష్ట పోయినా నష్టంలో కనీసం సగం అమౌంట్ అయిన ఇవ్వాలి… శాస్త్రీయంగా నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. వరద బాదితుల కోసం మా వంతుగా నా ఒక నెల జీతం నీ ప్రభుత్వంకు ఇస్తున్న..మావోయిస్టులు ఏమైనా రాక్షసుల.. ఎందుకు వాళ్ళ మీద నీకు కక్ష అమిత్ షా అన్నారు.
ALso Read:పార్టీ ఫిరాయింపు..హైకోర్టు తీర్పు చెంపపెట్టు:హరీశ్ రావు

