తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా..

303
mla vivekanand
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45 వేలు దాటగా 409 మంది మృత్యువాతపడ్డారు. పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద క‌రోనా బారిన‌ప‌డ్డారు.

క‌రోనా ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ఆయ‌న‌కు ప‌రీక్ష‌లు చేయ‌గా, పాజిటివ్ అనితేలింది. ఎమ్మెల్యే వివేక్‌తో పాటు ఆయ‌న భార్య‌, కుమారుడు, ప‌నిమ‌నిషికి కూడా క‌రోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు వైద్యశాఖ అధికారులు. ‌

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు , హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తాలకు కరోనా బారినపడి తిరిగి కోలుకున్నారు.

- Advertisement -