యూరియా కోసం పోరాటానికి సిద్ధం!

6
- Advertisement -

యూరియా కోసం రైతుల పక్షాన మేము పోరాటానికి సిద్ధం అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి. రైతులకు యూరియా కొరత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, వైఫల్యంపై ద్వజమెత్తారు. ఆసిఫాబాద్ రైతన్నలకు యూరియా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ, రైతుల పక్షాన ఆసిఫాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి కండ్లకు కనపడటం లేదా, చెవులకు వినపడటం లేదా నీకు పరిపాలన చేతకాకపొతే సీఎం పదవికి రాజీనామా చెయ్ అని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రైతన్నకు యూరియా ఇబ్బంది లేకుండా రైతులకు ఇచ్చిన నాయకుడు తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు.. 24గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మ పాలన చేసుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను పీడిస్తూ గద్దెనెక్కి కూర్చున్న రేవంత్, మంత్రులు దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలి…. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పి యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టే దుర్మార్గపు పాలన తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల గోస మీకు కనిపిస్తలేదా చెప్పాలన్నారు. ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని, పంటలకు అత్యవసరమైన యూరియాను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.

యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఒకవైపు వర్షాలు వస్తున్నాయి, మరోవైపు పంటలకు ఎరువులు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా యూరియా నిల్వలు లేవని చేతులెత్తేసింది. కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే దొందు దొందే.. ఈ డబుల్ గేమ్ ఆపాలి. అధికారులు, మంత్రులు స్పందించి, ఎక్కడి నుంచైనా యూరియాను వెంటనే తెప్పించి రైతులకు ఇవ్వాలి. లేకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుంది.రైతుల పక్షాన నిలిచి, రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు నా పోరాటం కొనసాగిస్తానని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలకు హెచ్చరిక చేశారు.

Also Read;బాన్సువాడలో పోచారం ఒంటరే!

- Advertisement -