జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గంగారెడ్డి ని మర్డర్ చేయించారు…సంజయ్ మర్డర్ చేయిస్తే ఎస్ పి గారు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సంజయ్ ని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు…మార్కెట్ చైర్మన్ కోసం ఈ మర్డర్ జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు స్వయనా చెప్పారు కేసు బుక్ చేయమని హత్య రాజకీయాలను ఎందుకు ప్రోత్స హిస్తున్నావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు.
అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా…కాంగ్రెస్ పార్టీ లో చేరకపోతే గాంధీ భవన్ లో కూర్చని తింటాడు సంజీవ్ అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినావు సిగ్గులేదా….బ్రోతల్ హౌస్ కన్నా అసహ్యంగా మారింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన తరవాత మీ దందాలో, మీ అక్రమలో అన్ని బయటకు తీసుకొస్తాం …అమాయకుడు అయినా గంగారెడ్డిని చంపడం బాధాకరం అన్నారు.
40సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిండు గంగారెడ్డి…చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మర్డర్ చేయించారు అన్నారు. రాహుల్ గాంధీ చెప్పారు పార్టీ మారితే వెంటనే దిస్ క్వాలిఫై చేస్తాం అని..పార్టీ మారిన ఎమ్మెల్యేలును దిస్ క్వాలిఫై చేయాలి అన్నారు. తెలంగాణను ఏమి చేద్దాం అనుకుంటున్నారు ఎవరు ప్రశ్నస్తే వారిని చంపుతార, దాడులు చేస్తారా….ముఖ్యమంత్రి, మంత్రులు టూర్ లలో ఉన్నారు, ప్రజలు అయోమయం లో ఉన్నారు అన్నారు. ఏ ఈ ఓ లో , గ్రూప్ 1,4 అభ్యర్థులు నిరసన తెలుపుతున్నారు …కానిస్టేబుల్ కుటుంబాలు ఆందోళన లో ఉన్నారు ..బతుకమ్మ చీరలు రాలేదు అని మహిళలు శాపనార్థులు పెడుతున్నారు అన్నారు.
Also Read:అద్భుతమైన మూవీ ‘కంగువ’:సూర్య