కాంగ్రెస్ 420 హామీలు, 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కౌశిక్…పోలీసులు తనను గంటపాటు విచారించారని, 32 ప్రశ్నలు అడిగారన్నారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ అడిగారని చెప్పారు
రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఒక రౌడీషీటర్ ఇచ్చిన ఫిర్యాదుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై కేసు నమోదుచేశారని చెప్పారు. కానీ బాధ్యతకలిగిన ఎమ్మెల్యేగా తాను ఫిర్యాదు చేస్తేమాత్రం కంప్లైంట్ ఫైల్ చేయలేదన్నారు.
డిసెంబర్ 4న ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లానని తెలిపారు. ఏసీపీ అపాయింట్మెంట్ తీసుకునే అక్కడికి వెళ్లానన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులే ముందుండి కాంగ్రెస్ గూండాలతో దాడి చేయిస్తున్నారని ఆరోపించారు.
Also Read:హరిహర వీరమల్లు…సాంగ్ వచ్చేసింది