- Advertisement -
ఫార్ములా ఈ పై చర్చ పెట్టాలంటే అంటే అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే మీద చెప్పు చూపించారు. ఇంతకంటే దారుణం ఉంటదా? అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చిట్ చాట్‌లో మాట్లాడిన కౌశిక్…ఇదేనా సభా సంప్రదాయం..?, ఆ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫార్ములా ఈ కంటిన్యూ అయితే టెస్లా వచ్చేది..వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణకు రేవంత్ రెడ్డి చెడ్డ పేరు తెచ్చారన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గు చేటు అన్నారు. ఈ కార్ రేసులో ఎలాంటి అవినీతి లేదు అని నిన్న పొన్నం ప్రభాకర్ చెప్పారని గుర్తుచేశారు కౌశిక్ రెడ్డి.
Also Read:ఫార్ములా ఈ కార్ రేసుపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
- Advertisement -