దానంకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్

6
- Advertisement -

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. హైదరాబాద్ నడిబొడ్డున్న తిరుగుతున్నా ఎక్కడి రమ్మంటావో చెప్పు వస్తానని చెప్పారు.దానం నాగేందర్‌కు ముఖ్యమంత్రి మైక్‌ ఇప్పించి తమను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దానం సంస్కారం లేకుండా మాట్లాడారని ..నిరుద్యోగుల కోసం తాము కొట్లాడుతుంటే.. దానం నీచమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దానం బెదిరింపులకు భయపడేవాళ్లు ఎవరూ లేరని స్పష్టం చేశారు.

లక్ష్మారెడ్డి, సుధీర్‌ రెడ్డి ఉప్పల్‌లో ఉరికించింది మరిచిపోయావా అని ప్రశ్నించారు. దానం నాగేందర్‌ రెడ్డికి ఎమ్మెల్యే పదవి కేసీఆర్‌ పెట్టిన భిక్ష అని కౌశిక్‌ రెడ్డి తెలిపారు. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‌ ఇచ్చిన 30వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డి సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని, జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగ ఖాళీల వివరాలు లేవన్నారు. జాబ్‌ క్యాలెండర్‌పై ఎవరి సంతకం లేదని , సీఎం, డిప్యూటీ సీఎం సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

Also Read:తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు

- Advertisement -