ఆటో డ్రైవర్లకు అండగా ఉంటాం:కౌశిక్ రెడ్డి

23
- Advertisement -

ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆటోలో వచ్చారు కౌశిక్. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల గిరాకీ లేక ఇప్పటివరకు 18 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.

ఆటో డ్రైవర్లకు మద్దతుగా తాను ఆటోలో అసెంబ్లీకి వచ్చానని, అయితే ఆటోను లోపలికి అనుమతించలేదని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఆటోలో అసెంబ్లీకి చేరుకున్న కౌశిక్‌ని భద్రతా సిబ్బంది ఆటోలో లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆటోలకు అసెంబ్లీలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Also Read:ఆరు గ్యారెంటీలకే అన్ని వేల కోట్లా?

- Advertisement -